విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో సంచలం రేపిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడ్డట్లుగా.. సృష్టి నాలుగు నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. సరోగసీ పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూళ్లు చేశారని.. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారని ఈడీ పేర్కొంది. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాప్ చేసి..వారి పిల్లలను కొనుగోలు చేసి..పిల్లలు లేని దంపతులకు సరోగసీ పేరుతో 50 లక్షలకు అమ్మేశారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనిలాండరింగ్ జరిగినట్లుగా గుర్తించింది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలకు సంబంధించి డాక్టర్ నమ్రతతో పాటు ఆమె బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో వారు సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ చేసినట్లు తేలింది.ఈ స్కామ్‌లో 25 మంది నిందితులుండగా.. వారిలో ఐదుగురు డాక్టర్లు, 8 మంది ఇతర సిబ్బంది అరెస్టు అయ్యారు.