TNSUI | తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ నూతన అధ్యక్షుడిగా ఎడవెల్లి వెంకటస్వామి
తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ నూతన అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామి నియమితులయ్యారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

దళిత సామాజిక వర్గానికి దక్కిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం సారధ్యం
TNSUI | తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ నూతన అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామి నియమితులయ్యారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుండగా, సీఎంగా, మంత్రులుగా, ఇతర కీలక పదవుల్లోనూ అగ్రకులాల వారికే అధిక ప్రాధాన్యం దక్కింది. దీంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపికపై సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. చివరకు కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో దళిత, బలహీన వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా దళిత సామాజిక వర్గంకు చెందిన ఎడవెల్లి వెంకటస్వామిని నియమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వెంకటస్వామి కొన్నాళ్ల పాటు ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగాను పని చేశారు. కాగా బీహార్ రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షడిగా జై శంకర్ ప్రసాద్, చండీఘర్ కు సికిందర్ బూర, ఢిల్లీకి ఆశిష్ లంబా, హిమాచల్ ప్రదేశ్ కు అభినందన్ ఠాకూర్, జార్ఖండ్ కు బినాయ్ ఒరన్, మణిపూర్ కు జైసన్ కేహెచ్, ఒడిస్సా కు ఉదిత్ నారాయణ ప్రధాన్, వెస్ట్ బెంగాల్ కు ప్రియాంక చౌదరీ లను నియమించారు.