జూపార్క్‌లో ఏనుగు దాడి..యానిమల్ కీపర్ మృతి
విధాత: హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఏనుగులకు ఆహారం పెట్టే యానిమల్ కీపర్ షాబాజ్ (28) దర్మురణం చెందాడు. ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ ఏనుగుకు ఆహారం పెట్టి వెనుకకు మరలిన సందర్భంలో అతని వెనుక నుంచి ఏనుగు ఆకస్మిక దాడి చేసి నేలకేసి కొట్టింది.
తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న షాబాజ్‌ను జూ సిబ్బంది చికిత్స నిమిత్తం డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదాగురు మావటీలు విధుల్లో ఉంటారు. శనివారం జపార్కు 60ఏళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించిన విందుకు కొంతమంది వెళ్లారు. ఆ సమయంలో షాబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram