Elections 2024 | కడియం, ఆరూరి మోసకార్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఊహించాం
మోస పూరిత రాజకీయాలను చేస్తున్న కడియం శ్రీహరి ఆరూరి రమేష్ లను ప్రజలు తరిమి కొడుతారని మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

విధాత, వరంగల్ ప్రతినిధి: మోస పూరిత రాజకీయాలను చేస్తున్న కడియం శ్రీహరి ఆరూరి రమేష్ లను ప్రజలు తరిమి కొడుతారని మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మొదటి నుండి అధికారం కోసం అడ్డదారులు తొక్కే వ్యక్తి కడియం శ్రీహరి అంటూ విమర్శించారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి దయాకర్ రావు మాట్లాడారు. నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది నేను…కేసీఆర్ ఇచ్చిన పదవులన్నీ అనుభవించి వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్ పార్టీలో చేరావని కడియాన్ని విమర్శించారు. కడియం నీకు దమ్ము,ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు. బీఆరెఎస్ నుంచి వెళ్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ అవినీతి పరుడు, భూ కబ్జా దారుడని ఎర్రబెల్లి మండిపడ్డారు. వరంగల్ పార్లమెంటులో డాక్టర్ సుధీర్ కుమార్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
పార్టీ ఓటమిని ముందే గ్రహించాను
42 సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో నేను చెప్పింది ఎప్పుడు నిజమైందని ఎర్రబెల్లి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ కు 20 సీట్లు మార్చమని చెప్పానని, నా సీటు కూడా మార్చాలని కోరినట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముందే మా పార్టీ ఓటమి నీ గ్రహీనిచినం. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గుల మాటలను నమ్మి వారిని ప్రజలు గెలిపించారని వివరించారు.
ఉద్యమ ద్రోహులు కడియం, ఆరూరి : దాస్యం
ఉద్యమ ద్రోహులు కడియం, ఆరూరిలు బీఆరెస్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. బీఆరెస్‌కు, బీజేపీ మధ్యలోనే ప్రధాన పోటీ అన్నారు. రాజకీయ ద్రోహి కడియం శ్రీహరి, రెండు సార్లు ఆరూరి రమేష్ ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే పార్టీ కి వెన్ను పోటు పొడిచి బీజేపీ పార్టీ లో చేరారని మండిపడ్డారు. గురు, శిష్యులు చీకటి ఒప్పందం కుదుర్చుకుని వరంగల్ ప్రజల ముందుకు వివిధ పార్టీల నుండి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కడియం ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి స్టేషన్ ఘనపూర్ లో పోటీ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వాసుదేవ రెడ్డి, జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్,నార్ల గిరి రమేష్,జోరిక రమేష్, పోలేపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.