Gade Innareddy Arrest| మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్టు
మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అధికారులు అరెస్డు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లోని తన ఇంటిలో అనాథ శరణాలయం నడుపుతున్న ఇన్నారెడ్డిని ఎన్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విధాత: మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డి(Gade Innareddy Arrest)ని ఎన్ఐఏ అధికారులు అరెస్డు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లోని తన ఇంటిలో అనాథ శరణాలయం నడుపుతున్న ఇన్నారెడ్డిని ఎన్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శరణాలయంలో సోదాలు నిర్వహించారు. గాదె ఇన్నయ్యను అరెస్టు చేయకుండా శరణాలయంలోని చిన్నారులు ఎన్ఐఏ అధికారులకు అడ్డుతగిలారు. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా గాదె ఇన్నారెడ్డి మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో మాట్లాడటం వివాదస్పదంగా మారింది.
ఇటీవల హిడ్మా ఊరు పువర్తికి ఇన్నయ్య మీడియాతో వెళ్లారు. అలాగే ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ల పై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు చేశారు. ఇన్నారెడ్డిపై ఉపా చట్టం కింద కేసులు నమోదైనట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram