Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 40 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతవాసం తర్వాత సొంతూరికి మాజీ మావోయిస్టు మల్ల రాజిరెడ్డి వెళ్లారు. పెద్దపల్లి జిల్లా మంథనికి వెళ్లిన ఆయనకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకుని రాజిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించారు. ఇకపై కుటుంబం, ప్రజల కోసం పనిచేస్తానని రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టం పరిధిలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన తేల్చిచెప్పారు.
మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం గడిపారు. మావోయిస్టు పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరించడానికి, బలపర్చడానికి వ్యూహకర్తగా గుర్తింపు పొందిన కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఆలియాస్ మీసాల సత్తన్న ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
