మా అసోసియేషన్ నుంచి నటి హేమ బహిష్కరణ ?
బెంగుళూర్ డ్రగ్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి హేమను మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతుంది. హేమను బహిష్కరించే విషయమై మా అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం ప్రకటన చేసే అవకాశముంది
విధాత : బెంగుళూర్ డ్రగ్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి హేమను మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతుంది. హేమను బహిష్కరించే విషయమై మా అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే హేమను బహిష్కరించాలా వద్ధా అన్న విషయమై మంచు విష్ణు మా అసోసియేషన్ గ్రూపులో సభ్యుల అభిప్రాయాలు కోరారు. సభ్యులంతా ఆమెను బహిష్కరించాలంటూ తమ అభిప్రాయాలు వెల్లడించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం ప్రకటన చేస్తారని తెలుస్తుంది. బెంగుళూర్ డ్రగ్ కేసులో హేమకు డ్రగ్ పాజిటీవ్ నిర్ధారణ జరిగింది. ఆమెను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram