Former MLA Bhupal Reddy | ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లివ్వండి.. కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వినతి
ఏఎమ్మార్పీ కాలువ పరిధిలోని నల్లగొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్లగొండ, మాడుగుల పల్లి మండలాలకు చెందిన డి 25, డి 37, డి39, డి40 డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతి పత్రం అందించారు.

విధాత, హైదరాబాద్ : ఏఎమ్మార్పీ కాలువ పరిధిలోని నల్లగొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్లగొండ, మాడుగుల పల్లి మండలాలకు చెందిన డి 25, డి 37, డి39, డి40 డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మీడియాతో వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఏఎమ్మార్పీ కాలువల ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందకపోవటంతో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, ,ఐనప్పటికి ఏఎమ్మార్పీ కాలువల ద్వారా సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికే నారుమళ్లు పోసుకున్న రైతులు సాగునీరందక నష్టపోతున్నారన్నారు. సీజన్ కు ముందే పంప్‌లు రిపేరు చేయవలసి ఉన్నప్పటికి ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అధికారుల అలసత్వంతో తీవ్ర జాప్యం చేసి ఆగస్టు మాసం వరకు కూడా సాగునీరందించలేకపోయారని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రులు ఈ సమస్యపై చోద్యం చూస్తున్నారన్నారు. స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశాలలో కాలం గడుపుతు..మాటలతో కోటలు కడుతున్నారని, చేతలు గడప దాడటంలేదని విమర్శించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోని తక్షణమే ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, లేకుంటే తాము రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా తమ పార్టీ హయాంలోనే ట్రయల్ రన్ నిర్వహించిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీం పాషా, నారబోయిన బిక్షం, బొజ్జ వెంకన్న మాజీ జడ్పీటీసీలు యాదగిరి, తుమ్మల లింగస్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు.. దేప వెంకట్ రెడ్డి అయితగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి,నల్గొండ సింగిల్ విండో వైస్ చైర్మన్ లు , కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సింగం మల్లేష్, కార్యదర్శి బడుపుల శంకర్, మెండు మణిపాల్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి ధర్వేశిపురం మాజీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, మాజీ సర్పంచులు మారయ్య, పందిరి జాన్ రెడ్డి రొయ్య బద్రి ఔరేసి శ్రీనివాస్, చింతల యాదగిరి దోమలపల్లి యాదగిరి, తగుళ్ళ శ్రీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.