మాజీ సర్పంచ్ దారుణ హత్య.. భూ తగాదాయే కారణం
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

రాయపర్తి మండలంలో ఘటన
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీo ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. దేవేందర్ భార్య అమెరికాలో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ తాగదా నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే అనుమానo వ్యక్తo చేస్తున్నారు.