సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల
గద్వాల బీఆరెస్ ఎమ్మల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తన అనుచరులతో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు

విధాత, హైదరాబాద్ : గద్వాల బీఆరెస్ ఎమ్మల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తన అనుచరులతో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల చేరికతో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరుకుంది.
బండ్ల చేరికను గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య వర్గం వ్యతిరేకించినప్పటికి వారికి సీఎం రేవంత్‌రెడ్డి నచ్చచెప్పి బండను పార్టీలోకి ఆహ్వానించారు. బండ్ల చేరికతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినట్లయ్యింది. కొన్ని రోజులుగా బండ్ల కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం చోటుచేసుకోగా, బీఆరెస్ అధిష్టానం ఆయనను పార్టీ వీడకుండా చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా తెలిపారు.