గాలికి కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జి
గతంలో వరదకు కూలిన టేకుమట్ల బ్రిడ్జి ఇప్పుడు గాలికి కూలిన గర్మిళ్లపల్లి బ్రిడ్జి
విధాత, వరంగల్ ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జి గ్యాడర్లు (బెడ్లు) సోమవారం రాత్రి వీచిన గాలికి (ఓడేడు పరిధిలో) కూలిపోయాయి. శకలాలు తాత్కాలిక రోడ్డుపై పడ్డగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత జూలై నెలలో వరదలకు టేకుమట్ల రాఘవ రెడ్డి పేట గ్రామాల మధ్యలోని చలివాగు పై నిర్మించిన బ్రిడ్జ్ వరదకు కొట్టుకుపోవడం.., ఇప్పుడు గాలికి ఈ బ్రిడ్జ్ కూలడం మండలంలో చర్చనీయాంశమవుతుంది.
2016లో బ్రిడ్జి పనులు ప్రారంభం
ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమితో వంతెన నిర్మాణం ఆగిపోయింది. అయితే సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులతో బ్రిడ్జి గడ్డర్లు కూలిపోయాయి. అర్ధరాత్రి సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram