ACB | ఏసీబీ వలలో మరో అవినీతి చేప

ACB | ప్రభుత్వం జీతాలు ఇస్తున్నా కొందరు అవినీతి అధికారులు మారడం లేదు. అత్యాశతో లంచాలు తీసుకుంటునే ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని నెలలు లంచం తీసుకుంటూ అనేక మంది ప్రభుత్వాధికారులు ఏసీబీకి చిక్కారు. అయినా లంచాధికారుల్లో మార్పు రావడం లేదు.

ACB | ఏసీబీ వలలో మరో అవినీతి చేప

లంచం తీసుకుంటూ దొరికిన గోల్నాక ఏఈ

ACB | ప్రభుత్వం జీతాలు ఇస్తున్నా కొందరు అవినీతి అధికారులు మారడం లేదు. అత్యాశతో లంచాలు తీసుకుంటునే ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని నెలలు లంచం తీసుకుంటూ అనేక మంది ప్రభుత్వాధికారులు ఏసీబీకి చిక్కారు. అయినా లంచాధికారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ బల్దియాలో మరో కరప్షన్ ఆఫీసర్ ఏసీబీ వలలో పడ్డారు. అంబర్ పేట సర్కిల్ లో పని చేస్తున్న మహిళా ఏఈ మనిషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. మనీషా గోల్నాక, అంబర్ పేటలో విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లును క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసింది.

దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి లంచం తీసుకుంటుండగా మనీషాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మనీషా పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని కోరారు. ఇలాంటి ఘటనలపై కంప్లైంట్ చేయడానికి ఏసీబీ తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని సూచించారు. లంచం గురించి వివరాలు అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సంబంధిత అధికారులు వెల్లడించారు.