అజారుద్దీన్, కోదండరామ్ ల ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం

అజారుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీ నియామకాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారింది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీలుగామంత్రి మహ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ నియామకానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. అజారుద్దీన్, కోదండరామ్ ల అభ్యర్థిత్వాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించగా…గత గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమోదం పెండింగ్ లో పడిపోయింది.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ కలిసి అజార్, కోదండరామ్ అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివారం ఎమ్మెల్సీలుగా అజారుద్ధీన్, కోదండరామ్ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు.

అజార్ పదవికి తప్పిన గండం

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, కోదండరామ్ ల పేర్లను ఆమోదించడంతో అజార్ తన మంత్రి పదవి కోల్పోయే గండం నుంచి బయటపడినట్లయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్బంగా కేబినెట్ మంత్రిగా పదవి ప్రమాణా స్వీకారం చేసిన అజారుద్దీన్ ఆరు నెలలోపు అసెంబ్లీ, లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. లేనట్లయితే రాజ్యాంగ నిబంధలన మేరకు తన పదవిని కోల్పోతారు. చట్టసభలకు అజారుద్దీన్ ఎంపిక కావాల్సిన గడువు ఈ నెల 30వ తేదీతో ముగిసిపోనుంది. అంతకుముందే అజార్, కోదండరామ్ ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఆమోదించడంతో అజార్ కు పదవీ గండం తప్పిపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి :

కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!
కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఘాటు సెటైర్..!

Latest News