హ్యామ్ రోడ్లలో స్కామ్..టెండర్లే నిదర్శనం : హరీశ్ రావు

హ్యామ్ రోడ్ల టెండర్లలో 25% ఎక్సెస్‌తో భారీ స్కామ్ జరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఖజానాపై వేల కోట్ల భారం పడుతుందని అన్నారు.

ఆర్ ఆండ్ బీ శాఖలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల టెండర్లలో భారీ స్కామ్ జరుగుతుందని తాము చేసిన ఆరోపణలు ఈ రోజున నిజం అని తేలాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా మేము బయటపెట్టాం అని, ఆర్ఆండ్ బీ, పంచాయతీరాజ్‌శాఖలో 25 టెండర్లను ఎక్సెస్ టెండర్లతో కొందరికి మాత్రమే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆనాడే చెప్పామని గుర్తుచేవారు.

25శాతం ఎక్సెస్ టెండర్లు..ఖజనాపై రూ.5కోట్ల అదనపు భారం

హ్యామ్ మోడల్ రోడ్ల టెండర్లో 25శాతం ఎక్సెస్‌తో టెండర్ వేశారని..మేం చేసిన ఆరోణపలు నిజమయ్యాయని హరీశ్ రావు చెప్పారు. రూ.11 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే రూ. 15 వేల కోట్లకు అధికంగా వెళ్లాయని, పంచాయతీ రాజ్ శాఖలో రూ.6వేల కోట్లతో పిలిస్తే..రూ.7నుంచి 8వేల కోట్లు టెండర్లు వెలుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 5వేల కోట్ల గండి పడుతుందని తెలిపారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్ర ఖజానాకు భారం పడనుందని, 25 శాతం అధికంగా టెండర్లు ఇవ్వబోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.

నాడు వద్దన్న అడ్వాన్స్ మొబిలైజేషన్ నేడు అమలు చేస్తున్నారు

వైఎస్ హయాంలో మొబిలైజేషన్ విధానాన్ని అప్పట్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడని, ఇప్పుడు అదే విధానం అమలు చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఈ టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. 2014 బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశామని, మా హయాంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీకాల్ చేసేవాళ్ళం అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్న పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. టెండర్లు అన్ని రీకాల్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తొందరలోనే ఆధారాలతో సహ బయటపెడుతానని హరీశ్ రావు ప్రకటించారు.

అక్రమాలతో సంబంధం లేకుంటే సీఎం టెండర్లు రద్దు చేయాలి

టెండర్లలో ఎక్సెస్ సీలింగ్ తీసేసి కాంట్రాక్టర్లు రింగ్ అయ్యేందుకు సహకరిస్తున్నారని, టెండర్ల ఫైల్ సీఎం ఆఫీసుకు చేరుకుందని.. అక్రమాలతో సీఎంకు సంబంధం లేకుంటే వెంటనే టెండర్లు రద్దుచేయాలి అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. హ్యమ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 వాయిదాలతో 15 సంవత్సరాల పాటు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాలపై తీవ్రమైన భారం పడుతుందని, రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా, పరోక్షంగా అప్పులు చేస్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు.

అధికారుల ఎక్స్ టెన్షన్ తో అవినీతి

ప్రధానమైన ఆర్ ఆండ్ బీ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన అధికారులను ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్ ఉండదని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆర్ ఆండ్ బీలో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవి కాలం పొడిగించి ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎక్సెస్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.

ఎస్టీపీల టెండర్లలో కాంగ్రెస్ మార్క్ భారీ కుంభకోణం

మరోవైపు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1,906 కోట్ల కాంట్రాక్ట్ ధారాదత్తం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఆరోపించింది. అమృత్ స్కీమ్ కింద రూ.1,906 కోట్ల రూపాయల విలువైన 22 STPల నిర్మాణం కోసం ఎలాంటి అనుభవం లేని రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు నిబంధనలు తుంగలో తొక్కి మరీ 51% వాటా కట్టబెట్టారని బీఆర్ఎస్ పేర్కొంది. ఎక్కడ టెండర్‌ జరిగినా పొంగులేటి కంపెనీలకే కాంట్రాక్ట్ ఇస్తూ తెలంగాణ ఆస్తులను దోచుకుంటున్న రేవంత్ & పొంగులేటిలు దోచుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి :

ఉజ్జయినిలో తవ్వకాల్లో బయటపడిన శివలింగం
అమెరికా నుంచి భారత్‌కు 657 ప్రాచీన వస్తువుల అప్పగింత

Latest News