మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్
బీఆరెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కౌంటర్ వేశారు

కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. రేవంత్ మ్యానిఫెస్టో వేర్వేరునా ?
విధాత: బీఆరెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కౌంటర్ వేశారు. రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామంటాడని, పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించమని అంటాడని, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకుంటామంటాడని హరీశ్‌రావు కౌంటర్ వేశారు.
కాంగ్రెస్ మంత్రులకు సిగ్గుండాలని, రాహుల్ గాంధీ మ్యానిఫెస్టో వేరు, సీఎం రేవంత్ రెడ్డి మ్యానిఫెస్టో వేరేగా ఉంటుందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని హరీష్ రావు జోస్యం చెప్పారు. బీఆరెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. బీఆరెస్ మళ్లీ అధికారంలో వస్తుందని… కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.