Rains | హైదరాబాద్‌లో మరో 2 గంటల్లో భారీ వర్షం.. జర జాగ్రత్త!
Rains | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలో బుధవారం మధ్యాహ్నం వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం( Heavy rains ) కురిసింది. రాత్రి 9.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rains | హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో బుధవారం మధ్యాహ్నం వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy rains) కురిసింది. ఈ భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. సాయంత్రం వేళ భారీ వర్షం కురియడంతో ఉద్యోగులు, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇక బుధవారం రాత్రి 9.20 గంటల సమయంలో తెలంగాణ వెదర్‌మ్యాన్ (Telangana Weatherman) నగర ప్రజలను అలర్ట్ చేశారు. మరో రెండు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురియనుందని హెచ్చరించారు. రాజేంద్రనగర్, ఫలక్‌నుమా ఏరియాల్లో వాన దంచికొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా చెప్పారో లేదో సరిగ్గా రెండు గంటల తర్వాత వర్షం దంచి కొట్టింది. గురువారం సైతం భారీ వర్షం కురుస్తుందని బయటకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని తెలిపారు.
గురువారం రోజంతా సూర్యుడు కనబడడని అంతా ముసురే ఉంటుందని, మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే ఉందని తెలిపారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయట ఉన్న వారు తక్షణమే తమ నివాసాలకు చేరుకోవాలని సూచించారు.
HyderabadRains UPDATE – Next 2hrs
LOW CLOUDS started forming all over the city. Expect FAST MOVING ON AND OFF light – moderate rains in various parts of Hyderabad next 2hrs. Sun won't come at all till noon. Post afternoon,ore rains ahead. It's going to be ముసురు next 6hrs 🌧️
— Telangana Weatherman (@balaji25_t) May 22, 2025
అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో బుధవారం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.
ENTIRE TG SMASHED 🌧️⛈️
Not even single district spared
Exceptional rainfall event in mid May ⛈️⛈️ pic.twitter.com/iHbYuudvJq
— Telangana Weatherman (@balaji25_t) May 22, 2025