విధాత,హైదరాబాద్: కొవిడ్-19 రెండో దశ పరిణామాలు ఇళ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో విక్రయాలు జనవరి-మార్చితో పోలిస్తే సగటున 23% తగ్గాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే 83% వృద్ధి కనిపించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 19,635 గృహాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. జనవరి-మార్చిలో మొత్తం 25,583 యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌లో 10,753 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. బెంగళూరులో ఈసారి విక్రయాలు పెరిగాయి. ఇక్కడ మొత్తం 3,500 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్‌లో నిర్మాణాల జోరు: 2021 తొలి మూడు నెలలతో పోలిస్తే..రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 15% క్షీణించాయి. అయితే 2020 జనవరి-జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో అమ్మకాలు 62% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇక్కడ కొత్త నిర్మాణాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8,591 కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభం కాగా.. రెండో త్రైమాసికంలో వీటి సంఖ్య 10,980 చేరింది. మొత్తం మీద హైదరాబాద్ నిర్మాణ రంగంలో 28 శాతం వృద్ధి కనిపించింది.
కరోనాతో 23 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు
<p>విధాత,హైదరాబాద్: కొవిడ్-19 రెండో దశ పరిణామాలు ఇళ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో విక్రయాలు జనవరి-మార్చితో పోలిస్తే సగటున 23% తగ్గాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే 83% వృద్ధి కనిపించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 19,635 గృహాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. జనవరి-మార్చిలో మొత్తం 25,583 యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌లో 10,753 యూనిట్లు మాత్రమే […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు