అమెరికా హ్యూస్టన్‌లో ఫెను తుఫాన్.. నలుగురి మృతి
అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ గురువారం పెను తుఫానుతో వణికిపోయింది.. ఈ తుఫాన్ కారణంగా నలుగురు మృతి చెందగా.. 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి

అంధకారంలో నగరం
విధాత: అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ గురువారం పెను తుఫానుతో వణికిపోయింది.. ఈ తుఫాన్ కారణంగా నలుగురు మృతి చెందగా.. 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. అకస్మాత్తుగా తుఫాన్ విరుచుకుపడడంతో జనజీవనం అతలాకుతలమైంది. గాలి వాన వల్ల విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి.
నగరమంతా అంధకారం అలుముకుంది. వరదనీరు భారీ ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు వీధులు, వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఆ ప్రాంత పరిధిలోని అన్ని యూనివర్సిటీలను, కళాశాలలను, పాఠశాలలను మూసివేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.