IAS Transfers | తెలంగాణాలో 20 మంది ఐఏఎస్‌ల అధికారుల బదిలీలు..

తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్ర‌భుత్వం బదిలీ చేసింది. దాదాపు 20 మంది ఐఏఎస్‌ల‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది

IAS Transfers | తెలంగాణాలో 20 మంది ఐఏఎస్‌ల అధికారుల బదిలీలు..

విధాత‌: తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్ర‌భుత్వం బదిలీ చేసింది. దాదాపు 20 మంది ఐఏఎస్‌ల‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, ములుగు సహా మొత్తం 20 జిల్లాలలో కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో భారీగా అధికారులు బదిలీలు జరిగాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత ఇంతటి స్థాయిలో బదిలీలు చేపట్టింది ప్రభుత్వం.

తెలంగాణలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలివే..

1. ఖమ్మం కలెక్టర్‌గా ముజామ్మిల్ ఖాన్ నియామకం
2. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బదావత్ సంతోష్ నియామకం.
3. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం.
4.రాజ‌న్న‌ సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ జా నియామకం.
5. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ నియామకం.
6. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్ నియామకం.
7. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ నియామకం.
8. నారాయణ్‌పేట్ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ నియామకం.
9. హన్మకొండ కలెక్టర్‌గా పి. ప్రవీణ్య నియామకం.
10 . జగిత్యాల కలెక్టర్‌గా బి సత్యప్రసాద్ నియామకం.
11. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజియేంద్ర నియామకం.
12. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా కోయ శ్రీ హర్ష నియామకం
13. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా కుమార్ దీపక్ నియామకం.
14. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నియామకం.
15. నల్లగొండ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి నియామకం.
16. వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ్ సురభి నియామకం.
17. సూర్యపేట కలెక్టర్‌గా తేజస్ నందలాల్ పవార్ నియామకం.
18. వ‌రంగ‌ల్‌ కలెక్టర్‌గా ఎం సత్య శారదా దేవి నియామకం.
19. ములుగు కలెక్టర్‌గా దివాకర నియామకం.
20. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా అభిలాష అభినవ్ నియామకం.