Commercial Tax Department | వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ పై అసిస్టెంట్ కమిషనర్ల ఫిర్యాదు

Commercial Tax Department | కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ లావణ్య తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు కె. శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బషీర్ బాగ్ సర్కిల్ లో పనిచేసే శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్నారు. ఈ డివిజన్ లోని రెండు వ్యాపార సంస్థలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేణుపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సంస్థలు రూ.80 కోట్ల ట్యాక్స్ ను కట్టలేదని గుర్తించి ఆ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని తనను వేధింపులకు లావణ్య వేధింపులకు గురి చేశారనేది వేణుగోపాల్ రెడ్డి ఆరోపణ. దీంతో ఆయన సెలవుపై వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు.
మరో సీటీఓ కె.శ్రీనివాసులు కూడా ఓ సంస్థలో తనిఖీలు చేసి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో తాను కూడా సెలవుపై వెళ్లాల్సి వచ్చినట్టు ఆయన అంటున్నారు. సెలవు నుంచి విధుల్లో చేరిన తర్వాత తమపై తప్పుడు ప్రచారం చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని జాయింట్ కమిషనర్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై వీరిద్దరూ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరితకు కూడా వినతిపత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రిజ్వికి కూడా కంప్లైంట్ చేసినట్టు వారు తెలిపారు.