హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఉగాది ఆఫర్.. ఆ మూడు స్కీమ్స్ మరో 6 నెలలు పొడిగింపు..!
ఉగాది పండుగ వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, మెట్రో స్టూడెట్ పాస్‌తో పాటు సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్‌ను హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు పొడిగించారు.

హైదరాబాద్ : ఉగాది పండుగ వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, మెట్రో స్టూడెట్ పాస్‌తో పాటు సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్‌ను హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు పొడిగించారు. మరో ఆరు నెలల పాటు ఈ మూడు స్కీమ్స్‌ను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మూడింటిని నిలిపివేస్తున్నట్లు ఇటీవలే హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మెట్రో ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు మళ్లీ ఆ మూడు స్కీమ్స్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకొని, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని సూచించారు.