హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన యత్నం
హైదరాబాద్ టూ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన కోసం తాను ప్రయత్నిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
విధాత : హైదరాబాద్ టూ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన కోసం తాను ప్రయత్నిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ టూ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రయత్నించానని గుర్తు చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటైతే అయితే హైదరాబాదు టూ విజయవాడ ఎవరు ఫ్లైట్ ఎక్కరని తెలిపారు.
హైదరాబాదులో సూపర్ గేమ్ ఛేంజర్ ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) రావడం జరిగిందని, దేశంలో హైదరాబాద్‌ను రోల్ మోడల్ సిటీగా మారుస్తామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాల ఉన్నాయని, ఒక్కోటిగా చేసుకుంటూ వెలుతామన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram