Self Road Repair | రోడ్లపై గుంతలకు ఆటోమేటిక్‌గా రిపేర్..! వినూత్న టెక్నాలజీని తీసుకురాబోతున్న కేంద్రం..!
Self Road Repair | భారత్‌లోని హైవేలు జాతీయ రవాణా నెట్‌వర్క్‌లో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రహదారి నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు ఆధునికీకరణకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా చాలా రహదారులు దెబ్బతిన గుంతలమయం అవుతున్నాయి. దాంతో తరుచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Self Road Repair | భారత్‌లోని హైవేలు జాతీయ రవాణా నెట్‌వర్క్‌లో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రహదారి నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు ఆధునికీకరణకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా చాలా రహదారులు దెబ్బతిన గుంతలమయం అవుతున్నాయి. దాంతో తరుచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశంలో రోడ్ల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, రోడ్లపై తరచూ ఏర్పడుతున్న గుంతలను పూడ్చేందుకు సరికొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నది. దాంతో రహదారుల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు జీవితకాలం పెరగనున్నది. ఈ రోడ్లలో వినూత్న సాంకేతిక టెక్నాలజీతో రోడ్డును వేసిన సమయంలో దెబ్బతిన్న సమయంలో దానికదే బాగు చేసుకోవడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతికతలో స్టీల్ ఫైబర్, బిటుమెట్‌తో కూడిన ప్రత్యేకమైన తారును వేస్తారు. ఇది రోడ్లు దెబ్బతిన్న సమయంలో రోడ్లు వాటంతటవే రిపేరు చేసుకుంటాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడినప్పుడు ఖాళీని పూరించేందుకు బిటుమెన్ విస్తరిస్తుంది.. స్టీల్ ఫైబర్స్ సైతం గుంతలను పూడ్చడంలో సహాయపడుతుంది. దాంతో రోడ్ల జీవితకాలం పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి.
అదే సమయంలో దేశంలోని రోడ్డు ప్రమాదాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించనున్నది. ఈ సాంకేతికత గుంతల సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా అధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే, గుంతలు, రోడ్లపై ఏర్పడే గ్యాప్‌ను ఆటోమేటిక్ ‘రిపేర్’ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. రోడ్లపై గుంతల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్నమైన, సాంప్రదాయేతర మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే, ఈ టెక్నాలజీతో రోడ్డుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత వరకు మన్నికగా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకునేందుకు హైవే అథారిటీ ఇండియా అధికారులు త్వరలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.