బయటకు రావద్దు..తెలంగాణలో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మాన్‌ ఎక్స్‌ పోస్ట్‌ హెచ్చరించింది.

బయటకు రావద్దు..తెలంగాణలో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మాన్‌ ఎక్స్‌ పోస్ట్‌ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వీటితో వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆగస్ట్‌ 12, 13 తేదీల మధ్య దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 150 మిల్లీ మీటర్ల నుంచి 200 మిల్లీ మీటర్ల వరకూ ఉంటుందని తెలిపింది. హైదరాబాద్‌లో మంగళవారం సాయత్రం నుంచి రాత్రి వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆగస్ట్‌ 13వ తేదీన కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

ఆగస్ట్‌ 14, 15 తేదీల మధ్య పశ్చిమ తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 150 మిల్లీ మీటర్ల నుంచి 200 మిల్లీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదు అయ్యే అవకాశ ఉందని అంచనా వేసింది.
హైదరాబాద్‌ నగరంలో ఆగస్ట్‌ 14వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో 70 మిల్లీ మీటర్ల నుంచి 120 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్ట్‌ 15వ తేదీన కూడా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.