Insta Reels | బైక్‌పై ఇన్‌స్టా రీల్స్ చేస్తూ యువకుడి మృతి.. మరొకరికి గాయాలు

సోషల్ మీడియాలో లైక్స్‌, కామెంట్ల కోసం ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగడం లేదు.

Insta Reels | బైక్‌పై ఇన్‌స్టా రీల్స్ చేస్తూ యువకుడి మృతి.. మరొకరికి గాయాలు

విధాత, హైదరాబాద్: సోషల్ మీడియాలో లైక్స్‌, కామెంట్ల కోసం ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్ పేట సమీపంలో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు వర్షంలో బైక్ పై స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశారు.

ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో శివ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయలు కాగా స్థానిక గమనించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇన్‌స్టా రీల్స్ వేలం వెర్రితో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూసైనా యువత తమ జీవితాన్ని, తల్లిదండ్రుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.