TSUTF | అంగన్ వాడీలను ప్లే స్కూల్స్ గా మార్చడం సరైంది కాదు .. టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జంగయ్య
అంగన్ వాడీలను ప్లేస్కూల్స్ గా మార్చి మూడవతరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని దీనిని ఫ్రభుత్వం వెంటనే విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది.
ప్రాథమిక పాఠశాలల్లోనే 1,2,3 తరగతులను నిర్వహించాలి
సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆహ్వానిస్తున్నాం
విధాత: అంగన్ వాడీలను ప్లేస్కూల్స్ గా మార్చి మూడవతరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని దీనిని ఫ్రభుత్వం వెంటనే విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. అంగన్ వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించటం లేదని తెలిపింది. 1,2,3 తరగతులను అంగన్ వాడీలకు అప్పగించటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకే దోహదపడుతుందని టిఎస్ యుటిఎఫ్ అభిప్రాయపడుతున్నదని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జంగయ్య, చావ రవిలు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ గా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతికొక టీచరు, సబ్జక్టుకొక టీచరు, ప్రధానోపాధ్యాయులు, తగినంత బోధనేతర సిబ్బంది పాఠశాలలో ఉండేలా చూడాలని వారు ప్రభుత్వానికి సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram