Jishnu Dev Varma | తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా త్రిపుర మాజీ సీఎం జిష్ణుదేవ్ వ‌ర్మ‌ నియామ‌కం

Jishnu Dev Varma | కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది. ఇందులో ఏడుగురిని కొత్త‌గా నియ‌మించ‌గా, మ‌రో ముగ్గురిని ఒక‌చోట నుంచి మ‌రోచోట‌కు బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శ‌నివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Jishnu Dev Varma | తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా త్రిపుర మాజీ సీఎం జిష్ణుదేవ్ వ‌ర్మ‌ నియామ‌కం

Jishnu Dev Varma | న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది. ఇందులో ఏడుగురిని కొత్త‌గా నియ‌మించ‌గా, మ‌రో ముగ్గురిని ఒక‌చోట నుంచి మ‌రోచోట‌కు బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శ‌నివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా త్రిపుర మాజీ సీఎం జిష్ణుదేవ్ వ‌ర్మ‌(66) నియ‌మించింది కేంద్రం. 1957 ఆగ‌స్టు 15న వ‌ర్మ జ‌న్మించారు. 2018 నుంచి 2023 వ‌ర‌కు త్రిపుర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడిగానూ సేవ‌లందించారు. వ‌ర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. రామ జ‌న్మ‌భూమి ఉద్య‌మ స‌మ‌యంలో 1990లో బీజేపీలో చేరారు.

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర‌కు బ‌దిలీ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్థానంలో ఉన్న ర‌మేశ్ బైస్‌ను త‌ప్పించింది. బ‌రేలీ నుంచి 1989 నుంచి వ‌రుస‌గా(2009-14 మిన‌హాయించి) 2019 వ‌ర‌కు గెలుపొందుతూ వ‌చ్చిన యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌ను జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించింది.