BJP Star Campaigner List | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ విడుదల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీజేపీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, భజన్ లాల్ శర్మ, బండి సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో బీజేపీ ప్రచారంలో పాల్గొననున్న 40మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్జున్ మేఘ వాల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, తేజస్వీ సూర్య, అన్నామలై, పురంధరేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపినాథ్ లతో దీపక్ రెడ్డి త్రిముఖ పోటీ ఎదుర్కొంటున్నారు. దీపక్ రెడ్డి 2023లోనూ బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు 25,866 ఓట్లు రాగా.. మూడోస్థానంలో నిలిచారు. దీపక్ రెడ్డి గతంలో తెలుగు యువత సిటీ ప్రెసి డెంట్, టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.