Delhi Liquor Scam | కవితకు మరోసారి నిరాశ … ఆగస్టు 13వరకు రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది.
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండును ట్రయల్ కోర్టు ఆగస్ట్ 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్ జైలులో ఉన్న కవితను వర్చువల్‌గా న్యాయస్థానం విచారణకు హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందునా కవిత కస్టడీని పొడగించాలని ఈడీ తరుపు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కవిత జైలులో ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram