భువనగిరికి కేసీఆర్ బస్సు యాత్ర.. రైతులకు పరామర్శ
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది
విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్ అనుసరించి ఉదయం కేసీఆర్ రైతు సమస్యలను తెలుసుకున్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతు ధరావత్ నర్సింహను కేసీఆర్ కలిశారు. ఆయన సమస్యలు విని ఆదుకుంటామని భరోసానిచ్చారు. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్ర కొనసాగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram