KCR Pays Condolences To Tanneeru Satyanarayana | హరీశ్ రావు తండ్రికి కేసీఆర్ నివాళి
తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన బావ, మాజీ మంత్రి టి.హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి.. నివాళి అర్పించారు. ఎర్రెవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హరీష్ రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్ అక్కడ సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేసీఆర్ వెంట కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram