BJP wins Khanapur| ఖానాపూర్ మున్సిపాల్టీలో కమల వికాసం!

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాల్టీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ఆదివారం అధికార యంత్రాంగం ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీకి చెందిన కౌన్సిలర్ అంకం మౌనిక చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన షోయబ్ ఎన్నికయ్యారు.

విధాత, హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాల్టీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ఆదివారం అధికార యంత్రాంగం ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీకి చెందిన కౌన్సిలర్ అంకం మౌనిక చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన షోయబ్ ఎన్నికయ్యారు. 12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ , బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు ఉండగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఓటుతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది.

శనివారం నిర్వహించిన ఎన్నికల్లో ఇబ్రహీం పట్నం చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్‌ పర్సన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సంధ్యారాణి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు.

Latest News