నాలుగు రైల్వే సర్వీస్‌ల పొడగింపు: మంత్రి కిషన్‌రెడ్డి

  • Publish Date - October 9, 2023 / 10:02 AM IST

విధాత : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాలుగు రైళ్ల సర్వీస్‌లను పొడగించగా, వాటికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పూణే-హైద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు, నాందేడ్‌-తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్ వరకు, జైపూర్‌-కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ సిటీ వరకు పొడగించారు. కరీంనగర్‌-నిజమాబాద్ ఫ్యాౌసింజర్ రైలును బోధన్ వరకు పొడగించారు. ఆయా సర్వీస్‌ల పొడగింపు సోమవారం నుండి ప్రయాణిలకు అందుబాటులో రానుంది.


ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని చాల ప్రాంతాల్లో కొత్తగా రైల్వే సర్వీస్‌లను అందుబాటులోకి తేస్తున్నామని, ఈ క్రమంలో నాలుగు రైళ్ల సర్వీస్‌లను పొడగించామన్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌-విశాఖ, తిరుపతి-సికింద్రాబాద్‌, హైద్రాబాద్‌-బెంగుళూర్‌లకు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకున్నామన్నారు. దేశంలో ఇప్పటిదాకా 34వందేభారత్ రైళ్లను ప్రారంభించగా అందులో తెలంగాణకు మూడు వచ్చాయన్నారు.


తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో 2.58కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను 5వేల కోట్లకు పెంచామని, 720కోట్లతో తెలంగాణ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. చర్లపల్లి టర్మినర్ పనులు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రజలకు అందుబాటులో తేవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్ పనులు సాగుతున్నాయని, యాదాధ్రి వరకు రెండో దశ సర్వీస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా మరిన్ని రైల్వే లైన్ల నిర్మాణాలను, రైళ్లను పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు పురోగతిలో ఉన్నాయన్నారు.