తెలంగాణ ప్రజల మేలు కోసం ప్రజాస్వామిక, రాజ్యంగ బద్ధ పాలన కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకరావాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పిలుపునిచ్చారు

విధాత: తెలంగాణ ప్రజల మేలు కోసం ప్రజాస్వామిక, రాజ్యంగ బద్ధ పాలన కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకరావాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సీఎం కేసీఆర్ భస్మాసురుడిలా తయారయ్యారన్నారు. కేసీఆర్ ఎందుకో రోజురోజుకు సహనం కోల్పోతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారన్నారు.

ఒడిపోతామన్న అనుమానం ఎక్కడో ఆయన మనసులో బలంగా పాతుకుపోయిందన్నారు. అందుకే కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని కేటీఆర్ చెబుతున్నారని, పదేళ్లుగా అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదని నిలదీశారు. చంపి చావు ఖర్చులకు డబ్బులు ఇస్తాం అన్నట్లు కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. అబద్ధం చెప్పి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ కు మళ్లీ గద్దెనెక్కే అవకాశం ఇవ్వవద్దని,ఆయన్ని ఓడించాల్సిందేనని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Updated On
Somu

Somu

Next Story