విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిని ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మార్టూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. సుమంత్ కేసులో ఇప్పటివరకు వారితో పాటు డ్రైవర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుమంత్ సహా ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగిస్తున్నారు.
సుమంత్ పై ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, రాడ్లతో దాడి చేశారంటూ వ్యాపారి గొంగడి హరికృష్ణ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
