మెట్రో రైల్లో బాబు అరెస్టు రచ్చ

  • Publish Date - October 14, 2023 / 06:21 AM IST

విధాత: చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు శనివారం హైదరాబాద్ మెట్రో రైల్ లో జై బాబు.. బాబుతో మేము మనము అంటూ నినాదాలతో రచ్చ చేశారు. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వెళ్తున్న మెట్రో రైల్లో గుంపులుగా ఎక్కిన టిడిపి కార్యకర్తలు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు.


అయితే తోటి ప్రయాణికులకు ఇది ఇబ్బందికరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్ మెట్రో స్టేషన్లు టిడిపి కార్యకర్తలను ట్రైన్ నుండి బయటకి దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా రైలు దాదాపు గంటపాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.