Maganti Mahananda Kumari| నా కొడుకు ఎప్పుడు చనిపోయాడో తెలియదు : మాగంటి గోపినాథ్ తల్లి

నా కొడుకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదని..జూన్‌ 6న చనిపోయారా.. 8న చనిపోయారా?’ అన్నదీ సందేహంగానే ఉందని..గోపీనాథ్‌ మరణం మిస్టరీగా ఉందని అందుకే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Maganti Mahananda Kumari| నా కొడుకు ఎప్పుడు చనిపోయాడో తెలియదు : మాగంటి గోపినాథ్ తల్లి

విధాత, హైదరాబాద్ : నా కొడుకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath Death) ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదని..జూన్‌ 6న చనిపోయారా.. 8న చనిపోయారా?’ అన్నదీ సందేహంగానే ఉందని..గోపీనాథ్‌ మరణం మిస్టరీగా ఉందని అందుకే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన తల్లి మహానంద కుమారి(Maganti Mahananda Kumari)సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ఏఐజీ ఆసుపత్రిలో కేటీఆర్‌ వచ్చిన తర్వాత మరణవార్తను బయటకు చెప్పారు. గోపీనాథ్‌ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి టైమ్‌ ఇవ్వలేదు అని, ఒక్క అటెండర్‌ను కూడా ఆయన వద్ద పెట్టలేదు అని.. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని ప్రకటించారని తెలిపారు. ఆసుపత్రిలో కేటీఆర్‌ వెంట పరుగెత్తి నన్ను నా కొడుకుని చూడనివ్వడం లేదని చెప్పినా ఆయన కూడా వినిపించుకోలేదన్నారు.

లీగల్ సర్టిఫికెట్ లో మొదటి భార్య, బిడ్డలు, నాపేరు లేవు

లీగల్ సర్టిఫికెట్ లో మొదటి భార్య, బిడ్డలు, నాపేరు లేవుఇకపోతే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యంగా ఉందని మహానందకుమారి అన్నారు. మొదటి భార్య మాలినీతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్‌తో సునీత పెళ్లి చేయలేదు..అయినా ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో మా పేరు లేదు అన్నారు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే నలుగురిలో నిరూపించుకోవాలనే బయటకు వచ్చాం అని, ఇలా మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నానని..గోపీనాథ్‌ మొదటి భార్య, కుమారుడికి గుర్తింపు ఉండాలి కదా అని..ఈ విషయంలో మాలినీ ఎంతో బాధపడుతోందన్నారు. ఆమె ఎన్నో అవమానాలు పడిందని..ఆమెను వద్దు అనుకుంటే గోపినాథ్ ఎప్పుడో విడాకులు తీసుకునేవాడు. అలా జరగలేదు అంటే.. సాఫ్ట్‌ కార్నర్‌ ఉన్నట్లే కదా అని మహానంద దేవి చెప్పుకొచ్చారు.

మమ్మల్ని సంప్రదించకుండానే సునీతకు టికెట్

సునీతకు టికెట్‌ ఇచ్చేటప్పుడు కేటీఆర్‌ మాకు కనీసం సమాచారం ఇవ్వలేదని మహానంద దేవి తెలిపారు. నా పెద్ద కొడుకు కూడా టికెట్ కోసం ప్రయత్నించాడు. గోపీనాథ్‌ తల్లిగా నాకు అడగాల్సిన హక్కులేదా? లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో మా పేర్లు లేవని ఆగస్టు 11 నుంచి తహసీల్దార్‌ కార్యాయానికి వెళ్లి వస్తున్నాం. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు అని అన్నారు.

గుర్తింపు కోసమే మా పోరాటం : తారక్

తమకు లీగల్‌గా ఎలాంటి గుర్తింపు లేదని గోపీనాథ్‌ మొదటి భార్యకుమారుడు తారక్‌ ప్రదుమ్నా ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్‌ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత.. యూఎస్ లో ఉన్న నాకు ఎందుకు ఫోన్‌ చేశారు. ఎవరో తెలియకపోతే.. ఎందుకు నాన్న, సునీతలు నాకు ఎందుకు ఫోన్‌ చేసినట్లు? అని ప్రశ్నించారు. నా కాల్ రికార్డ్స్ లో ఉన్న నాన్న నెంబర్, సునీత ఫైల్ చేసిన అఫిడవిట్ లో ఉన్న ఫోన్ నెంబర్ ఒక్కటే అని వెల్లడించారు. నా గ్రాడ్యుయేషన్  డేకి రావాలని మా నాన్న అనుకున్నారని..ఇంతలోనే హఠాత్తుగా చనిపోయారు అని తెలిపారు. సునీత నాకు ఫోన్‌ చేసి.. నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు. రెజ్యూమ్ పంపించు.. కేటీఆర్‌ అంకుల్‌ కంపెనీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారని చెప్పారని వెల్లడించారు. మా నాన్న అంత్యక్రియలకు నన్ను రానివ్వకుండా పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించారని తెలిపిన ప్రద్యుమ్న తారక్ మా పెద్ద నాన్న, నాయనమ్మలపై సునీత, మోహన్ ముళ్లపూడి లేనిపోని మాటలు చెప్పారని విమర్శించారు.  కేటీఆర్ కు అమెరికాలో చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనే నిన్ను చూసుకుంటారని సునీత నాకు చెప్పారన్నారు.  జూన్‌ 25న ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లై చేశారని..అప్పుడు అఫిడవిట్‌లో ఎవరి పేర్లు పెట్టారో నాకు తెలియదు. మా అమ్మ, నాన్నమ్మ, నా పేర్లను లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌లో పెట్టాలి అని కోరడం జరిగిందని తారక్ తెలిపారు.