పోక్సో కేసులో అరెస్టయి, నెల రోజులకుపైగా జైల్లో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరైంది. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆయనకు వారం రోజులపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి అధికారులు ఆయన్ని విడుదల చేశారు.అయితే బెయిల్‌కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం నిందితుడికి స్పష్టం చేసినట్లు సమాచారం.
బాలిక ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు బగీరథ్‌ను మే 16న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.
ఇప్పటికే భగీరథ్ కు రెగ్యులూర్ బెయిల్ కోసం వేసిన మూడు బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది. అయితే భగీరథ్ కు పరీక్షల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి పోక్సో కోర్టు తాజాగా ఐదు రోజుల పాటు ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మళ్లీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది.
