Telangana | హైదరాబాద్ మెడికోను హతమార్చిన మావోయిస్టులు

మావోయిస్టుగా పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన డీఎల్‌ఎంటీ విద్యార్థినినీ కోవర్టు అంటూ మావోయిస్టులు హతమార్చారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఒక లేఖను విడుదల చేశారు

Telangana | హైదరాబాద్ మెడికోను హతమార్చిన మావోయిస్టులు

కోవర్టుగా మారిందని హత్య
ప్రకటించిన ఏవోబీ కార్యదర్శి గణేశ్‌

Telangana | మావోయిస్టుగా పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన డీఎల్‌ఎంటీ విద్యార్థినినీ కోవర్టు అంటూ మావోయిస్టులు హతమార్చారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఒక లేఖను విడుదల చేశారు. హైదరాబాద్ బాలాజీనగర్ న్యూ ఇందిరా నగర్‌కు చెందిన బంటి బాలయ్య, బాలమ్మల కుమార్తె నీల్సో( బంటి రాధ) ఇంటర్ చదువుకుని, డీఎంఎల్‌టీ పూర్తి చేసి 2018లో విప్లవోద్యమంలో చేరి గడిచిన ఆరేళ్లు 6సంవత్సరాల కాలంలో ఏవోబీలోనే పనిచేసింది. పార్టీ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌, నాయకత్వ రక్షణ దళం కమాండర్‌గా ఎదిగింది. పార్టీ క్రమశిక్షణ మేరకు నడుచుకోకపోవడంతో ఆమెను గత మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి పార్టీ సస్పెండ్ చేసింది.

పోలీసులు ఆమెను పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాధ తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బుచ్చి లోబరుచుకోగా, అతను ప్రీతి, రాజు, సురేశ్‌, రాజులతో కలిపి నిరుద్యోగ లంపెయిన్ గ్రూప్‌ను తయారు చేసుకుని విప్లవాభిమానుల, ప్రజాసంఘాల కార్యకర్తల సమాచారాన్ని పోలీసులకు అందిస్తుండగా.. వారు దాడులు చేయడం సాగింది. కొద్ది నెలల క్రితం రాధ ఫోన్ నెంబర్ తెలుసుకున్న పోలీసులు తన స్నేహితురాలైన మమతతో ఆమెను పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకు రాధ అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులను చంపుతామని, జైళ్లో పెట్టిస్తామని బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. తమ్ముడు సూర్యంతో మాట్లాడించి కుటుంబం కోసం కోవర్టుగా పనిచేసేందుకు రాధను ఒప్పించారు.

అప్పటి నుంచి తెలంగాణ, చత్తీస్‌ఘడ్ ఇంటలిజెన్స్ అధికారులతో టచ్‌లో ఉంటూ వారు కోరిన విధంగా పార్టీ నాయకత్వం, పార్టీ కీలక సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. కోవర్టు టీమ్‌లో సభ్యురాలిగా మారి మావోయిస్టు పార్టీ నాయకత్వ నిర్మూలనకు పోలీసుల భారీ పథకంలో భాగస్వామ్యమైంది. సకాలంలో పోలీసుల కుట్రను పసిగట్టి విప్లవ ద్రోహులైన కోవర్టులను గుర్తించిన మావోయిస్టు పార్టీ ప్రజాభిప్రాయం మేరకు కొందరిని పార్టీ నుంచి బహిష్కరించాలని, మరికొందరికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా నీల్సో(బంటి రాధ)కు కూడా మరణ శిక్ష అమలు చేశామని మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శి గణేశ్ ప్రకటిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఈ మరణ శిక్ష అమలు చేశారు.