Medaram Transformation | వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వనదేవతలు కొలువైన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులతో మేడారం కొత్త శోభను సంతరించుకు్టున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సాగుతున్న పనులు వేగం పుంజుకున్నాయి. జాతర ప్రాంగణమంతా వివిధ రకాల పనులు, నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Transformation | వనదేవతలు కొలువైన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులతో మేడారం కొత్త శోభను సంతరించుకు్టున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సాగుతున్న పనులు వేగం పుంజుకున్నాయి. జాతర ప్రాంగణమంతా వివిధ రకాల పనులు, నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి జాతర అభివృద్ధి పనుల పురోగతిని చూసి, అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి, ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ , రాతి స్తంభాల స్థాపన నిర్మాణ, జంపన్న వాగు వద్ద పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మరో వందేళ్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే, పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం: మంత్రులు
ఆదివాసీల ఆరాధ్య దైవం కొలువైన మేడారాన్ని అద్భుతంగా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం అక్కడే వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా వనదేవతల గద్దెలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ది పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సమయానికి ఏర్పాట్లు పూర్తయేలా దీవించమని వనదేవతలను కోరుకున్నామన్నారు.
జాతరకు కోటికిపైగా భక్తులు
జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని చెప్పారు. జాతర ప్రారంభం నాటికి నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకువెళ్తున్నామన్నారు. తుది దశకు నిర్మాణ పనులు చేరుకుంటున్న క్రమంలో ప్రతి వారం రోజులకు ఒకసారి సహచర మంత్రులు, ధనసరి అనసూయ సీతక్క, కొండ సురేఖ, నేను స్వయంగా వచ్చి ఏర్పాట్లను పర్యావేక్షిస్తామన్నారు. జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి పనులను భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంగణాన్ని మహా అద్బుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also |
Congress Warangal East | వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
New C5 Power Bloc | భారత్‌తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
Gilli Danda| మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram