New C5 Power Bloc | భారత్‌తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచాన్ని భావజాలం ఆధారంగా కాకుండా, శక్తిమంతుల మధ్య ఒప్పందాలు, ప్రభావాలు, గౌరవం ఆధారంగా చూస్తారని, అందుకే ఇలాంటి శక్తిమంతమైన బ్లాక్ ఆయన ఆలోచన విధానానికి సరిపోతుందని మాజీ ఎన్‌ఎస్‌సీ అధికారిణి టోరీ టాస్సిగ్ అంచనా వేశారు.
New C5 Power Bloc | యూరప్ దేశాలు, సంప్రదాయ ప్రజాస్వామ్య, సంపన్న దేశాల ఆధిపత్యంలో ఉన్న జీ–7ను పక్కనపెట్టేందుకు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొత్త కూటమికి ‘C5’, లేదా ‘కోర్ ఫైవ్’ అని పేరు పెడతారని తెలుస్తున్నది. ఈ కొత్త కూటమిలో అమెరికా, భారత్, రష్‌యా, చైనా, జపాన్ భాగస్వాములుగా ఉంటాయని సమాచారం. అయితే దీనిపై ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. వైట్ హౌస్ గతవారంలో జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రచురించింది. అయితే.. దానికి ముందు ప్రచురించని విస్తృత వెర్షన్‌లో కొత్త బలమైన శక్తుల గ్రూప్ కోసం ఒక ఆలోచన వచ్చినట్టు అమెరికన్ పబ్లికేషన్ ‘పొలిటికో’ పేర్కొన్నది. జీ7 దేశాలకు లోబడని ప్రధాన శక్తులతో కొత్త కూటమిని సృష్టించడమే ఈ ఆలోచన వెనక ఉద్దేశంగా తెలిపింది.
కోర్ 5 లేదా సీ5గా పిలిచే ఈ కూటమి జీ–7 తరహాలోనే క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంది. శిఖరాగ్ర సమావేశాల్లో నిర్దిష్ట అంశాలపై చర్చలు చేస్తుంది. సీ5 తొలి ప్రతిపాదిత అజెండాలో మధ్య ఆసియాలో భద్రత, ప్రత్యేకించి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం ఉండొచ్చని పొలిటికో పేర్కొన్నది.
ప్రస్తుతం ప్రచురితమైన 33 పేజీల అధికారిక ప్రణాళిక కాకుండా ప్రత్యామ్నాయ, ప్రైవేట్ లేదా సీక్రెట్ వెర్షన్లు ఏమీ లేవని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ నొక్కి చెప్పారని పొలిటికో పేర్కొన్నది. అయితే.. జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఈ కొత్త కూటమితో ట్రంప్ లింకు ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అమెరికా పరిస్థితికి సీ5 ఏర్పాటు సరైందేనని చెబుతున్నారు.
ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచాన్ని భావజాలం ఆధారంగా కాకుండా, శక్తిమంతుల మధ్య ఒప్పందాలు, ప్రభావాలు, గౌరవం ఆధారంగా చూస్తారని, అందుకే ఇలాంటి శక్తిమంతమైన బ్లాక్ ఆయన ఆలోచన విధానానికి సరిపోతుందని మాజీ ఎన్‌ఎస్‌సీ అధికారిణి టోరీ టాస్సిగ్ అంచనా వేశారు. ప్రతిపాదిత సీ5లో యూరప్‌కు స్థానంలేని విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇది యూరప్‌లో రష్యాను శక్తిమంతమైన దేశంగా అమెరికా చూస్తుందనేందుకు సంకేతమన్నారు. ట్రంప్ తన తొలి విడత పాలనలో గ్రేట్ పవర్ కాంపిటిషన్ సిద్ధాంతాన్ని పాటించారు. ముఖ్యంగా ట్రంప్ తన చైనా పాలసీ నుంచి దూరం కావటమేనని టెడ్ క్రూస్ మాజీ సలహాదారుడు మైఖేల్ సొబోలిక్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Agro Processing Hub | వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
Komati Reddy : ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు
HIV : ఐటీ ఉద్యోగులారా! తస్మాత్ జాగ్రత్త..ఆ వైరస్ తో డేంజర్
Himalayas Earthquakes | హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram