కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పీసీసీకి, క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశానని, ఈ రోజు ఖర్గేకు ఫిర్యాదు చేశానని..అనంతరం ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఏఐసీసీ నాకు టికెట్ ను డబ్బులు తీసుకుని ఇచ్చిందని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశానని, కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డికి 8 సార్లు బీ ఫామ్ ఇచ్చిందన్న సంగతి విస్మరించి కన్నతల్లి వంటి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మేఘారెడ్డి విమర్శించారు. ఎనిమిదిసార్లు చిన్నారెడ్డి కూడా పార్టీకి డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నారా అని మేఘారెడ్డి నిలదీశారు.
వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి బీఆర్ఎస్ కేడర్ ను చిన్నారెడ్డి వెంటబెట్టుకొని తిరుగుతున్నారని, బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని, దీనిపైన, రోజురోజుకు నన్ను టార్గెట్ చేయడంపైన ఖర్గేకు నివేదిక అందించానని మేఘారెడ్డి తెలిపారు. రిపోర్టుతో పాటు చిన్నారెడ్డి వాయిస్ రికార్డు కూడా ఇచ్చాని, నిరంజన్ రెడ్డితో కలిసి చిన్నారెడ్డి పని చేస్తున్న ఆధారాలు ఉన్నాయని వాటిని ఖర్గేకు అందించాని, చిన్నారెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకేభవిస్తున్నానని, పార్టీ క్రమశిక్షణ నియమావళికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.