d. Shridhar Babu | మూసీ సుందరీకరణకు ప్రపంచ బ్యాంకు సహాయం : మంత్రి డి. శ్రీధర్ బాబు

: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగల కల్పన లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం చేపట్టిన వీదేశీ పర్యటనలో భాగంగా 19ఎంవోయూలు చేసుకుని, 31వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లుగా మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు.

d. Shridhar Babu | మూసీ సుందరీకరణకు ప్రపంచ బ్యాంకు సహాయం : మంత్రి డి. శ్రీధర్ బాబు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగల కల్పన లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం చేపట్టిన వీదేశీ పర్యటనలో భాగంగా 19ఎంవోయూలు చేసుకుని, 31వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లుగా మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే 20ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏమిటో తెలిపేందుకే అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు చేసినట్లు తెలిపారు. తాము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదని మంత్రి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ సంస్థలకు నమ్మకం కలిగించేందుకే పర్యటన చేసినట్లు చెప్పుకొచ్చారు. చేసుకున్న ఒప్పందాలతో వచ్చే కంపనీలతో 30వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందన్నారు. ఏఐ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ నది అభివృద్ధిపై పలువురితో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. మూసీ నది అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం అమెరికాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం ఇదే తొలిసారని మంత్రి గుర్తు చేశారు. ఈ పర్యటన వల్ల కాగ్నిజెంట్, ఆర్ అండ్ డీ వంటి సంస్థల విస్తరణ ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్నింగ్ వంటి సంస్థలు తెలంగాణను విడిచి పోతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కార్నింగ్ సంస్థలతో చర్చలు జరిపామని వారు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసేందుకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతల బంధువులు వచ్చినా స్వాగతిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీని కోరామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.