విధాత : హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఎలివెట్ కారిడార్లు, అండర్ వేలు, ఫై ఓవర్లు నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ ప్రాంతాల్లో 12లక్షల మందికి జనం, 65కాలనీలు ఉన్నాయని, ఇక్కడి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ – హైదరాబాద్ హైవేను రూ.10,400కోట్లతో 6లైన్లు, 2 సర్వీస్ రోడ్లతో నిర్మిస్తున్నామని త్వరలోనే టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఇదే మార్గంపై నాగ్ పూర్ మోడల్ మాదిరిగా డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించేందుకు డీపీఆర్ పూర్తయ్యిందని, త్వరలోనే మంజూరీ, టెండర్ లను పూర్తి చేయిస్తామని తెలిపారు. దీంతో జంటనగరాలకు, ఆంధ్రకు మధ్య మార్గం సులభతరం అవుతుందన్నారు.
తుక్కుగూడ, మన్ననూరు వరకు 6లైన్స్, అక్కడి నుంచి 56కిలోమీటర్లు శ్రీశైలం వరకు రూ,7600కోట్లతో ఎలివెట్ కారిడార్ నిర్మించబోతున్నామని తెలిపారు. 13వేల కోట్లతో హ్యామ్ హైబ్రిడ్ మోడల్ లో 34ప్యాకెజీల కింద రోడ్లను అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు. అందులో పంచాయతీ రాజ్ కింద రూ.6వేల కోట్లో హ్యామ్ రోడ్ల పనులు జరుగబోతున్నాయని తెలిపారు. ఏప్రిల్ ఆఖరు నాటికి ఆ పనులన్నింటిని ప్రారంభిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
ఆ చెత్త డంప్ ప్రాంతం నా గుండెకాయ: మాజీ మంత్రి మల్లారెడ్డి
Actress | ట్రైలర్ లాంచ్ వివాదం.. హీరోయిన్‌కి ముద్దు పెట్టడం విషయంలో క్లారిటీ ఇచ్చిన ధురంధర్ 2 నటుడు
