ఆ చెత్త డంప్ ప్రాంతం నా గుండెకాయ: మాజీ మంత్రి మల్లారెడ్డి
జవహర్‌నగర్ డంప్ యార్డ్ సమస్యపై మల్లారెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు.. కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
విధాత, హైదరాబాద్ : నా నియోజకవర్గంలోని చెత్త డంపింగ్ జవహర్‌నగర్ ప్రాంతం నా గుండెకాయ..ఇదే విషయం అక్కడి ప్రజలకు చెప్పినా..అందరికి చెప్పినా…జీహెచ్ఎంసీ చెత్త అంతా తెచ్చి అక్కడే వేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తనదైన శైలిలో ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మల్లారెడ్డి మాట్లాడుతూ మా ఇన్ చార్జ్ మంత్రిగా నా మిత్రుడు శ్రీధర్ బాబు వచ్చాడని ఎంతో సంతోషించాను అని, కానీ ఇప్పుడు బాధపడుతున్నానని, నా గుండె బాధతో భరించలేకపోతుందన్నారు. నా గుండెకాయ లాంటి జవహర్ నగర్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేసి చెత్త కుప్పగా మార్చేశారు అన్నారు. కంపు కొడుతున్న జనహర్ నగర్ లో నేను, నా ప్రజలు ఉండలేకపోతున్నారన్నారు. శ్రీధరన్నకు దండం పెడతా.. నాపై పగ వద్దు అంటూ వ్యాఖ్యానించారు.
కొన్నేళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కూడా అక్కడే చెత్త వేస్తున్నారని, అయితే నేను బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ రూ.500 వందల కోట్లు ఇచ్చి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. 149కోట్లతో మట్టి పోసి గడ్డి పెట్టి గుట్టలాగా మార్చామని, వర్షాకాలంలో వాసన రాకుండా మురుగునీటి శుద్ది కోసం మరో 250 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు చేశామన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంతాన్ని చెత్తకుండిలా తయారుచేశారు అన్నారు. రెండున్నరేళ్లుగా స్థానిక ప్రజలు పెరిగిపోయిన చెత్త, కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారన్నాని, వారి బాధలు చూడలేకపోతున్నానన్నారు. దండం పెడుతా శ్రీధర్ అన్నా..నా మీద పగ ప్రజల మీద చూపెట్టకండి, మోరీలు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, కరెంటు స్తంబాలు లేవు అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. పైగా జహవర్ నగర్ ను తీసుకెళ్లి జీహెచ్ఎంసీలో కలిపారు అన్నారు.
హైదరాబాద్ మస్తు డెవలప్ అయ్యిందని, కాని చెత్తంగా మా దగ్గరకే వస్తుందని, నేను ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు గెలిచానోనని బాధపడుతున్నానన్నారు. ప్రజల కష్టాలు చూసి భరించలేకపోతున్నానన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అన్న…మీకు దండం పెడుతున్న దయచేసి స్పెషల్ ఫండ్ రూ.1000కోట్ల ఇచ్చి పేద ప్రజలను రోగాల భారీనుండి కాపాడాలని మల్లారెడ్డి కోరారు.
మంత్రి శ్రీధర్ బాబు ఒకసారి తనిఖీ చేయాలని, ఈ మధ్య ఆయన రాకుండా మా నియోజకవర్గానికి పట్నం మహేందర్ రెడ్డిని పంపిస్తున్నారని, నా మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కొత్త పెళ్లి కొడుకుగా కూడా అబద్దాలే మాట్లాడుతున్నాడు: మంత్రి శ్రీధర్ బాబు
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల 50వ వివాహ వార్షికోత్సవం వేడుకతో పెళ్లిచేసుకున్నారని, కొత్త పెళ్లి కొడుకుగా ఆయన నిజాలు మాట్లాడుతారు అనుకుంటే మళ్లీ అబద్దాలే మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన కష్టపడి పైకి వచ్చారని, బయట చాల బాగా మాట్లాడుతాడని, సభలో మాత్రం పక్కన ఉన్న వారి ప్రభావంతో తప్పుదారి పడుతుంటాడని సెటైర్లు వేశారు. మల్లారెడ్డి తన మాటల్లోనే రోడ్లు, మోరీలు, విద్యుత్తు, నీళ్లు లేవని బీఆర్ఎస్ హయాంలో ఏం చేయలేదని చెప్పారని చురకలేశారు. బీఆర్ఎస్ హయాంలోనే జవహర్ నగర్ డంప్ యార్డ్ కు అన్నీ చేశామని మల్లారెడ్డి చెప్పారని, అయినా మేం మల్లారెడ్డి చెప్పిన సమస్యను దృష్టిలో పెట్టుకుని డంప్ యార్డుకు ప్రత్యామ్నాయ ఏరియాను పరిశీలిస్తాం అన్నారు. నగరం నలుమూలలా డంప్ యార్డ్ లను ఏర్పాటు చేస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
Actress | ట్రైలర్ లాంచ్ వివాదం.. హీరోయిన్‌కి ముద్దు పెట్టడం విషయంలో క్లారిటీ ఇచ్చిన ధురంధర్ 2 నటుడు
లొంగిపోనున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram