మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర: మంత్రి కోమటిరెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనను ఏక్‌నాథ్‌షిండేతో పోల్చుతు చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందనిపిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు

మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర: మంత్రి కోమటిరెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనను ఏక్‌నాథ్‌షిండేతో పోల్చుతు చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందనిపిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు

ఆయనే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించాడు

విధాత, హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనను ఏక్‌నాథ్‌షిండేతో పోల్చుతు చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందనిపిస్తుందని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఆయన నాపై విమర్శలు చేయడం అశ్చర్యంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని, కాంగ్రెస్ పార్టీలో చేరుతా మంత్రి పదవి ఇవ్వమని మహేశ్వర్ రెడ్డి అడిగాడని వెంకట్‌రెడ్డి వెల్లడించారు. తాను తన సొంత ఇమేజ్ తో గెలిచానని, ఎన్నికల్లో బీజేపీ నుంచి నాకొచ్చిన ఫయిదా ఏంలేదని చెప్పిండని, కాంగ్రెస్‌లో ఉంటే ఇయ్యాల మంత్రిని అయ్యేవాడినని దిగులు పడ్డాడని, అట్లాంటి వ్యక్తి నన్ను షిండే అన్నడంటే నాకే విచిత్రంగా ఉందని కోమటిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

నేను షిండేను అవునో కాదు భగవంతునికి ఎరుక అని, మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనర్ధన్ రెడ్డి అని వెంకట్‌రెడ్డి అభివర్ణించారు. అవకాశం ఇస్తే.. రాత్రికి రాత్రే పార్టీ మారుతనని బతిమాలిండని, కాంగ్రెస్‌లో ఎవ్వరు సప్పుడు చెయ్యకపోయేసరికి నాపై కామెంట్లు చేస్తున్నడని, మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. గాలిమాటల మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో జెండాలు మార్చి నాపై విమర్శలు చేస్తుండని, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ దేశంలో చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అని, తాను కాంగ్రెస్ లో పుట్టిన.. కాంగ్రెస్ జెండాతోనే పోతానని, కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అని స్పష్టం చేశారు.