Minister Komatireddy | జాతీయ రహదారులపై కేంద్ర కార్యదర్శితో మంత్రి వెంకట్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమావరం ఢిల్లీలో జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల (మోర్త్) శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో భేటీ అయ్యారు.
విజయవాడ హైదరాబాద్ ఆరులైన్లు..నల్లగొండ బైపాస్ టెండర్లకు వినతి
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమావరం ఢిల్లీలో జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల (మోర్త్) శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్ కు మంత్రి వినతి పత్రం అందించారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్‌సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరారు.
అలాగే విజయవాడ-హైదరాబాద్ ఆరులైన్ల నిర్మాణ పనుల టెండర్లపై చర్చించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అభ్యర్ధించారు. స్పందించిన అనురాగ్ జైన్ నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్‌సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంకట్‌రెడ్డితో పాటు సమావేశంలో ఆర్‌ఆండ్‌బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram