10న మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్ పర్యటన

  • Publish Date - October 8, 2023 / 06:58 AM IST
  • ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్ ఈనెల 10న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు ఎన్ఎస్పీ మైదానంలో బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యస్బీ డీఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, మిర్యాలగూడ డీఎస్పి వెంకట గిరి, సీఐలు రాఘవేందర్, సత్యనారాయణ, నరసింహులు, యస్.ఐ నరసింహ పాల్గొన్నారు.