Minister Ponnam Prabhakar | క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజాపాలన: మంత్రి పొన్నం ప్రభాకర్

క్విట్ ఇండియా స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ ప్రజాపాలన సాగిస్తుందని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కోన్నారు

Minister Ponnam Prabhakar | క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజాపాలన: మంత్రి పొన్నం ప్రభాకర్

విధాత, హైదరాబాద్ : క్విట్ ఇండియా స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ ప్రజాపాలన సాగిస్తుందని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కోన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాట్లాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్రోద్యమ క్రమంలో జాతిపిత మహాత్మగాంధీ నిర్వహించిన క్విట్ ఇండియా ప్రజల స్వేచ్చ, స్వాతంత్రాల ఆకాంక్షలను చాటిందన్నారు.

ఈ రోజు చారిత్రాత్మకమైన దినమన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సమాజాన్ని కాపాడుకోవడానికి, మన సమస్యలను పరిష్కారం కోసం శాంతియుత మార్గంలో ముందుకు సాగాలన్నారు. ఆ ఉద్యమ స్పూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చదనం స్వచ్చదనంలో భాగస్వామ్యం కావాలన్నారు. భారతదేశాన్ని అఖండ భారతదేశం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలని, దేశంలో మనందరం బాధ్యతగా శ్రమపడి ముందుకు వెళ్లాలని, స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ అణిచివేత చర్యలలో అమరులైన వారికి నివాళులు ఆర్పిస్తున్నామన్నారు. స్వతంత్ర ఫలాలు అందరికీ చేరే విధంగా పాలకులు, అధికారులు కృషి చేయాలన్నారు.

గాంధీ భవన్‌లో ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవాలు

క్విట్ ఇండియా దినోత్సవం వేడుకను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సేవాదల్ చైర్మన్ జితేందర్ నేతృత్వంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, కుమార్ రావ్ తదితరులు పాల్గొన్నారు.