ఎండలు మండుతున్నాయి.. కూలీలు జాగ్రత్త: మంత్రి సీతక్క
ఎండలు మండిపోతున్నాయి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జై నూరు మండలంలో ఎండ తీవ్రతను ఉద్దేశించి ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు సూచన
విధాత: ఎండలు మండిపోతున్నాయి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జై నూరు మండలంలో ఎండ తీవ్రతను ఉద్దేశించి ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు కూలీ పనులకు వెళ్ళే వారంతా త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ఇక్కడి ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆవసరమైతెనే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావాలని, లేదంటే ఇంటిపట్టునే ఉండాలని మంత్రి సీతక్క సూచించారు